- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి 4 నుంచి జయహో బీసీ : నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల ద్రోహి అని నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. బీసీలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి ‘జయహో బీసీ' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.‘జయహో బీసీ’ రెండు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామని నారా లోకేశ్ వెల్లడించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామని నారా లోకేశ్ అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని నారా లోకేశ్ వెల్లడించారు.