జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కరువు

by Javid Pasha |
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కరువు
X

దిశ, జంగారెడ్డిగూడెం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా జంగారెడ్డిగూడెం వంద పడకల ఆసపత్రి దుస్థితి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతో అద్భుతమైన సేవలు అందించిన జంగారెడ్డిగూడెం ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో నేడు కనీస వసతులు లేక దైన స్థితిలో ఉండటం బాధాకరమని, చుట్టూ ఉన్న తొమ్మిది మండలాల్లో పేద ప్రజలకు అనారోగ్యం వస్తే సంజీవనిల ఈ ఆసుపత్రి పనిచేస్తుందని, అలాంటి ఆసుపత్రిలో సిబ్బంది కొరత తో సరైన వైద్యం అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ కృషితో వచ్చిన ఎక్స్ రే విభాగం నేడు సిబ్బంది లేక మూత పడిందని, కనీసం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇప్పటివరకు దానిపై దృష్టి పెట్టకపోవడం అత్యంత బాధాకరమని, రక్త పరీక్ష విభాగంలో కూడా అదే రకమైన పరిస్థితి నెలకొందని సరైన పరికరాలు, మందులు లేకపోవడంతో, సమస్యల వలయంలో ఆసుపత్రి కొట్టుమిట్టాడుతుందని శేషు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పూర్తిస్థాయి వసతులతో పాటు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed