పిఠాపురంలో జనసేనాని గెలుపు ఖాయమా..సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-09 14:37:30.0  )
పిఠాపురంలో జనసేనాని గెలుపు ఖాయమా..సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇక అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సినీ నటులు సైతం ప్రచారం నిర్వహించారు. పవన్ కుటుంబం కూడా పవన్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ట్వీట్టర్ వేదికగా పవన్‌ని గెలిపించండని కోరారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ రెండు సార్లు ఓటమి చెందారనే విషయం తెలిసిందే.

కానీ ఈ సారి ఎన్నికల్లో జనసేనాని గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ప్రజెంట్ ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం హాట్ టాపిక్‌గా మారుతోంది.ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు మారుమోగుతోంది. ఇంతలా పిఠాపురం పేరు మారుమోగాడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది ఇలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడించడానికి వైసీపీ గట్టి వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారనే విషయం పై నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. 75 వేల నుంచి లక్ష మెజారిటీ రావొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

ఎన్నికల వేళ..పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

Advertisement

Next Story