- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంతెన కోసం జనసైనికుల నిరసన
ప్రభుత్వం నిర్మించకపోతే భిక్షాటన చేసి నిర్మిస్తాం
వడ్డాది వంతెన దుస్థితి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి పట్టదా?
దిశ, డైనమిక్ బ్యూరో: వంతెనలేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆరోపించారు. శిథిలమైన వడ్డాది వంతెన సమస్యను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ జనసేన ఇన్‌చార్జి పీవీఎస్ఎన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పట్టించుకోకపోతే జన సైనికులే ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని జనసేన నేతలు తెలిపారు.
వడ్డాదిలో వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ గురువారం 48 గంటల నిరవధిక దీక్షకు దిగారు. విశాఖ, ఉత్తరం, గాజువాక ఇన్‌చార్జిలు పసుపులేటి ఉషాకిరణ్, కోన తాతారావు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు పలికారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిథిలమైన వడ్డాది వంతెన నిర్మించాలని జనసేన నేతలు పసుపులేటి ఉషాకిరణ్, కోన తాతారావులు డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు. ఈ దీక్షలో ఏడిద భార్గవ్, గండి దుర్గాప్రసాద్, రాయపరెడ్డి కృష్ణ, జనసైనికులు డీఎస్ నాయుడు, యడ్ల రామ్మూర్తి, దొండా సాయి తదితరులు పాల్గొన్నారు