Breaking: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ

by srinivas |   ( Updated:2023-04-29 12:46:11.0  )
Breaking: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ ఢిల్లీ వెళారు. బీజేపీ జాతీయ నేతలను కలిశారు. తాజాగా చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మూడుసార్లు కలిశారు.

కాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా శుక్రవారం చంద్రబాబును కలిశారు. సుధీర్ఘంగా చంద్రబాబుతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, మోదీపై ప్రశంసలు కురిపించారు. దీంతో బీజేపీతో చంద్రబాబు మరోసారి పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. వచ్చే ఏడాది రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు అధికార పార్టీ కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed