- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Janasena:నేటి నుంచి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు
దిశ ప్రతినిధి,అనకాపల్లి:జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంను నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర కోరారు. నర్సీపట్నం ఎన్జీఓ హోమ్‌లో గురువారం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరించారు.
జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జనసైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా రూ. 5 లక్షల బీమా, 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. కావున జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురు చేత సభ్యత్వ నమోదును చేయించారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, ఐటీ కోఆర్డినేటర్ అల్లు నరేష్, నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.