ముదురుతున్న వివాదం.. అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:22:46.0  )
ముదురుతున్న వివాదం.. అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా, అల్లు అభిమానుల మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి(శిల్ప రవి)కి బన్నీ సపోర్ట్ చేయడంతో ప్రారంభమైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో తనకు నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. జనసేన పార్టీ ఉండగా.. వైసీపీకి సపోర్ట్ చేయడమే కాకుండా.. తాను నచ్చిన వారి కోసం ఎంతదూరమైనా వెళ్తా చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.

ఈ తరుణంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్న సంగతి తనకు తెలియదు అని సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. ఇటీవల బొలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఎవరూ లేరని.. ఆయనే అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడ ఉన్నది కేవలం చిరంజీవి అభిమానులు, మెగా ఫ్యాన్స్ మాత్రమే అని అన్నారు. అల్లు అర్జున్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచామని.. మాకు అల్లు అర్జున్ అవసరం ఏమాత్రం లేదని కొట్టిపారేశారు. ఆయన సపోర్ట్ చేసిన ఏకైక వైసీపీ అభ్యర్థి ఓడిపోయాడని.. ఆ విషయం అల్లు అర్జున్ గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story