- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Janasena: రాష్ట్ర రాజకీయాల్లో కీలకశక్తి.. జనసేన
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. 2014లో పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆవిర్భవించిన జనసేన పార్టీ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంతో పాటు నెంబర్ 2 స్థానాన్ని చేరుకోవడంలో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనసేనకు యువత, మధ్య తరగతి ప్రజలు, వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నదని చెప్పాలి. నిరంతరం ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు మరింత చేరువైంది.
ప్రజల మన్ననలు పొందుతూ..
జనసేన పార్టీ ప్రజల మనస్సులు గెలుచుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేస్తోంది. యువతకు ప్రధాన ప్రేరణ ఇచ్చే వ్యక్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదిగారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాటిక్ జీవితం, వ్యక్తిత్వం, సామాజిక విషయాలపై స్పష్టమైన అవగాహనతో యువతను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జనసేన కార్యకలాపాలకు మంచి ప్రచారం లభిస్తోంది.
వైసీపీపై వ్యతిరేకత.. జనసేనకు ప్లస్..
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉండడాన్ని గమనించిన అధినేత పోరాటాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజలు నూతన ప్రత్యామ్నాయ శక్తిగా జనసేనను ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం వారి సమస్యలను వినడం, అలాగే సంక్షేమ పథకాలను రూపొందించడం ద్వారా ప్రజలకి దగ్గర అవుతుండటంతో జనసేన ఆదరణ పెరిగింది. పవన్‌కి రాజకీయ రంగంలో ఎదుగుదల కూడా సులభం కాలేదు. 2014లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించారు.
ఓటమి నుంచి గెలుపు..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకొని భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ కూటమి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఒక్క సీట్ మాత్రమే గెలిచిన జనసేన 2024 ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ తమ పాత్రను "సినిమా నాయకుడు"గా మొదలుపెట్టి, "రాజకీయ నాయకుడు"గా మారడం ద్వారా రాజకీయాలనూ, సామాజిక సేవలకూ కొత్త నిర్వచనం చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు.