- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ సిట్టింగ్ సీటుపై జనసేన ఫోకస్.. చంద్రబాబు ఒప్పుకుంటారా....?
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తాయని ఇప్పటికే ఆ పార్టీ అధినేతలు స్పష్టం చేశారు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడ పోటీ చేయాలనే పంచాయతీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదుర్చేపనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కొన్ని సీట్ల జనసేన నేతలు టీడీపీ సిట్టింగ్ స్థానాలపై ఆశలు పెంచుకుంటున్నారు. ఆ సీటు జనసేన నేతలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని టీడీపీకి సూచిస్తున్నారు.
కాగా రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. వైఎస్ పాదయాత్రను సైతం ఎదుర్కొని గత ఎన్నికల్లో బుచ్చయ్య విజయకేతనం ఎగురవేశారు. అంతేకాదు వైసీపీని స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడంలో ఆయన దిట్ట. అటు రాజమండ్రి రూరల్‌లో టీడీపీకి మంచి పట్టుంది.
అయితే ఈ సీటుపై జనసేన నేత కందుల దుర్గేష్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి రెండు స్థానంలో నిలిచిన ఆయన ఈసారి ఆ సీటును తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పదిహేనేళ్లుగా రాజమండ్రి రూరల్‌లోనే పని చేస్తున్నానని, అందువల్ల ఆ సీటు తనకే దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తానే పోటీ చేస్తున్నానని దుర్గేష్ దీమా వ్యక్తం చేస్తున్నారు.
అటు ఇదే నియోజకవర్గం వైసీపీ నుంచి మంత్రి వేణుగోపాల్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనను రాజమండ్రి రూరల్ ఇంచార్జిగా నియమించారు. దీంతో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో వైసీపీ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు మంత్రి వేణు రంగంలోకి దిగడంతో గోరంట్ల బుచ్చయ్యకు గట్టి పోటీ ఎదురైనట్టైంది.
ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్దండులు రాజమండ్రి రూరల్ బరిలో ఉండగా కందుల దుర్గేష్‌కు ఈ సీటు దక్కుతుందా.. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.