breaking:మీటింగ్ల కోసం ఆ పనులు చేయడం మీకు అలవాటు.. వైసీపీపై జనసేన ఫైర్

by Indraja |
breaking:మీటింగ్ల కోసం ఆ పనులు చేయడం మీకు అలవాటు.. వైసీపీపై జనసేన ఫైర్
X

దిశ డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు భీమవరంలో పర్యటించాల్సి ఉంది. ఇందుకుపవన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో ఉన్న విష్ణు కళాశాలో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు హెలిపాడ్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో రోడ్లు భవనాలశాఖ కలశాలకు దూరంగా ఉన్న భవనాలను సాకుగా చూపిస్తూ హెలిపాడ్ ఏర్పాటుకు అనుమతివ్వలేదు.

దీనితో అధికార పార్టీనే ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆఖరి నిమిషంలో అనుమతులను రద్దు చేయడంపై X వేదికగా జనసేన పార్టీ స్పందించింది. మీటింగ్ల కోసం విద్యార్థుల పరీక్షలు రద్దు చేయడం, చెట్లను నరకడం, ఆర్టీసీ బస్సులను తరలించడం మీకు అలవాటు, మీ నాయకుడు చెప్పే సొల్లు వినలేక పారిపోవడం ప్రజలకు అలవాటు, జనసేనాని ఒక్క పిలుపుకు భయపడి ఆఖరి క్షణంలో అనుమతులను రద్దు చేసిన మీ ప్రభుత్వాన్ని, ప్రజలు మరో రెండు నెలల్లో రద్దు చేస్తారు అని పోస్ట్ ట్విట్టర్ పోస్ట్ లో జనసేన రాసుకొచ్చింది.

Advertisement

Next Story