Breaking: 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. తొలి విడత షెడ్యూల్ ఇదే..

by srinivas |   ( Updated:2023-06-02 11:53:26.0  )
Breaking: 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. తొలి విడత షెడ్యూల్ ఇదే..
X

దిశ, దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అన్నవరంలో పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కల్యాణ్ వారాహిలో బయల్దేరతారని ఆయన పేర్కొన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వివిధ వర్గాలతో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారాహి యాత్రపై చర్చించారు.

కాగా పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహిలో తొలి విడత యాత్ర చేపట్టనున్నారు. ఉభయగోదావరి జిల్లాల షెడ్యూల్ ఖరారు అయింది. అన్నవరం నుంచి అమలాపురం వరకు మినెట్ మినెట్ కార్యక్రమాన్ని ఖరారు చేశారు. పర్యటనలో భాగంగా ప్రతి రోజు ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం రెండు రోజులు పవన్ కల్యాణ్ ఉండేలా టూర్ ప్లాన్ చేశారు. ఆ రెండు రోజలు పవన్ కల్యాణ్ స్థానిక నేతలతో సమస్యలపై చర్చించనున్నారు. ఈ యాత్ర ఎన్నికల ప్రచారం కాకుండా సమస్యల పరిష్కారం కోసమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read..

Janasena: జనంలోకి వారాహి.. త్వరలో యాత్రకు సిద్ధమైన పవన్

Advertisement

Next Story

Most Viewed