- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాటతీసి మోకాళ్లపై నడిపిస్తాం.. వైసీపీ నాయకులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: మళ్లీ జగన్ గెలిస్తే దేవుడు భూములను కూడా వదిలిపెట్టరని.. ఎక్కడ స్థలం కనిపిస్తే యదేచ్ఛగా కబ్జాలు చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ఉంగుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమికి ఓట్లు వేస్తే వేళ్లు తీసేస్తామని ఓటర్లను వైసీపీ నాయకులు బెదిరించినట్లు తన దృష్టి వచ్చిందన్నారు. వారందరికీ తాను వ్యక్తిగతంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందే ఆ పార్టీ నాయకులను తరిమితరమి కొట్టామని, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ‘కూటమి అభ్యర్థులు ఓట్లు వేస్తే వేళ్లు తీసేస్తారా?. కొట్టండని వీపు చూపిస్తామనుకుంటున్నారా?. వైసీపీ నాయకులు పై నుంచి దిగొచ్చారా?, జనసైనికులను బెదిరించే దమ్ముందా.’ అని పవన్ ప్రశ్నించారు. ఓటర్లను మళ్లీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీసి ఉంగుటూరు రోడ్లపై మోకాళ్ల మీద నడిపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాటాకు చప్పుళ్లకు జనసేన నాయకులు, కార్యకర్తలు భయపడరన్నారు. ప్రజా స్వామ్యానికి గౌరవం ఇవ్వాలని.. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు ఓట్లు వేస్తారని చెప్పారు. ఇష్టంగా ఓటు వేసే వారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు.
Read More..
పేకాట క్లబ్బులు కావాలా..డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా..: యువతకు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న