జగన్ తోక కత్తిరించబోతున్నాం: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-03-14 14:05:29.0  )
జగన్ తోక కత్తిరించబోతున్నాం: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో కూటమి పోటీ చేయబోతున్నామని, సీఎం జగన్ తోక కత్తిరించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని చీకటి కమ్మేసిందని.. వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వైసీపీ రౌడీ మూకలకు జనశక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా జనవాణి నిర్వహిస్తామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ, జగన్‌పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విరోధం లేదని తెలిపారు. అయితే ఇంకెవడు బతకకూడదనే భావన తనకు నచ్చదని చెప్పారు. తమను తొక్కేస్తామంటూ తాము తొక్కుతామని హెచ్చరించారు. రాజకీయ సభల్లో గ్రాఫిక్స్ వాడటం వైసీపీకి అలవాటు అని ఎద్దేవా చేశారు. 15 లక్షల మంది జనాభా అంటే నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. తనపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో వైసీపీ వాళ్ల ఊహకే వదిలేస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Read More..

పిఠాపురం నుంచి పవన్ పోటీ..టీడీపీ జెండాలు, ప్లెక్సీలు తగలబెట్టిన నేతలు

Advertisement

Next Story