- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ఢిల్లీ వెళ్తా.. కేంద్రమంత్రి అమిత్ షా, JP నడ్డాకు ఆ మ్యాటర్ చెప్తా: పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరిస్తానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు గురించి ఢిల్లీ పెద్దలకు వివరిస్తానన్నారు.
ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి.. టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ పెద్దలతో మాట్లాడుతానని అన్నారు. జైల్లో ఉన్నవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దని.. జైలుకు వెళ్లి రాటు దేలిన వారు చాలా మంది ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. జగన్ కూడా జైలుకెళ్లి సీఎం అయ్యి పీడించుకుతింటున్నాడని మండిపడ్డారు. టీడీపీ నేతలను ఎవరూ కించపర్చొద్దని పవన్ కోరారు. కష్ట కాలంలో ఉన్నవాళ్లకు అండగాల నిలవాలని అన్నారు.
More News : సీఎం జగన్ ఒక మానసిక రోగి.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు