సైకిల్ నడిపి సందడి చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (వీడియో)

by Disha Web Desk 4 |
సైకిల్ నడిపి సందడి చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీ గుర్తు అయిన సైకిల్ నడిపి సందడి చేశారు. పిఠాపురం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన గెలుపును కాంక్షిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యులను జనసేనాని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా ఓ వ్యక్తి సైకిల్‌పై ప్రచారం చేస్తున్నాడని తెలుసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఆ వ్యక్తి సైకిల్ నడిపి సందడి చేశారు. ఇక, జనసేన పార్టీ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది. సలార్ బీజీఎంతో ఎడిట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ తీసి జనసేన చీఫ్ పవన్ నామినేషన్ వేసేందుకు వెళ్లారు.



Next Story

Most Viewed