Pawan Delhi Tour: అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా...!

by srinivas |   ( Updated:2023-04-03 12:57:34.0  )
Pawan Delhi Tour: అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా...!
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌లో బీజీ బిజీగా ఉన్నారు. పలువురు బీజేపీ ఆగ్రనేతలను ఆయన కలుస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పొత్తులపై చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ ఇంఛార్జి మురళీధరన్‌తో భేటీ అయ్యారు. గంటకు పైగా ఆయనతో చర్చించినట్లు సమాచారం. కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే అపాయింట్‌మెంట్‌పై అస్పష్టత నెలకొంది. మరోవైపు పవన్ ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తమకు సమాచారం లేదని తెలిపారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌తో ఢిల్లీ వెళ్లారు.

ఇక పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇంకా మరికొన్ని సమావేశాలు ఉన్నాయని తెలిపారు. అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతానని పవన్ తెలిపారు.

Advertisement

Next Story