- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ సంచలన హామీలు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన హామీలు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇస్తామన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. విశిష్ట వారధిని నిర్మిస్తామన్నారు. కోనసీమలో రైలు కూత వినిపిస్తుందని తెలిపారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
పదేళ్ల కష్టాల మధ్య జనసేన పార్టీ పెరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను మొగల్తూరులోని చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చానని, చిన్న, చిన్న పట్టణాల్లో పెరిగానన్నారు. ప్రతి మనిషి పడే కష్టం తనకు తెలుసని పవన్ కల్యాణ్ తెలిపారు. నరసాపురంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి నరసాపురంలోనే చదువుకున్నారని పవన్ గుర్తు చేశారు. సీఎం జగన్‌పై మాదిరిగా తనపై 32 కేసులు లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీయేతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Read More..