- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jana Sena : నేడు జనసేన శాసన సభ పక్షం భేటీ

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) అసెంబ్లీ(Assembly)బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)అధ్యక్షతన జనసేన(Jana Sena)శాసనసభాపక్షం(Legislative Assembly party meeting) సమావేశం కానుంది.
జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ అవుతారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై అవగాహన, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వైఖరి, బడ్జెట్ పై చర్చలో అనుసరించాల్సిన తీరుపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చర్చించి పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27 అసెంబ్లీకి సెలవు దినాలు. 28వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు. దానికిముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలియచేస్తారు.