Amaravati: తెలంగాణపై పవన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

by srinivas |   ( Updated:2023-06-12 15:01:47.0  )
Amaravati: తెలంగాణపై పవన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పార్టీని బలోపేతం చేసేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నారు. అటు తెలంగాణలోనూ పార్టీ బలోపేపతంపై దృష్టి సారించారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలో జనసేన బలోపేతంపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన నేతలకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కీలక సమాచారం బయటకు వస్తుందని ఆ పార్టీకి నేతలు అంటున్నారు.

కాగా ఏపీలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఈ విషయాన్ని బీజేపీ, జనసేన నేతలు చాలా సార్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని అవసరమైతే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. తెలంగాణ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తూ చాలా కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎక్కడ కూడా జనసేన నేతలు పాల్గొనలేదు. మరీ ఏపీలో పొత్తులవైపు చూస్తున్న పవన్ కల్యాణ్.. మరి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తారా..?. లేదా బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

Vijayawada: వారాహి యాత్రను అడ్డుకోలేరు: పోతిన మహేశ్

Advertisement

Next Story

Most Viewed