ఆరు నెలల తర్వాత జనసేన, టీడీపీదే ప్రభుత్వం: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-05 14:31:20.0  )
ఆరు నెలల తర్వాత జనసేన, టీడీపీదే ప్రభుత్వం: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు నెలల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం గురుజ సెంటర్‌లో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిస్తే అధికార వైసీపీకి భయమెందుకని ప్రశ్నించారు. 175 సీట్లు వచ్చేది ఉంటే వైసీపీ భయపడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. జనసేనాని చూసి భయపడుతున్నారంటే.. మీరు బలహీనపడ్డటేనని అన్నారు.

రాష్ట్రంలో ప్రజలను కులాల వారీగా విభజిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారసత్వ రాజకీయాలతో తనకు ఇబ్బంది లేదని.. జనసేనకు 150 మంది ఎమ్మెల్యేలు.. 30 మంది ఎంపీలు ఉంటే ప్రతిపక్షాల ఊసే ఎత్తనన్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తామని.. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కైకలూరు నీటి సమస్యను తీరుస్తామని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2014లో తనపై దాడి చేయడానికి సిద్ధమయ్యారని.. నా కార్యాలయం చుట్టూ వైసీపీ గుండాలను మోహరించారని సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story