నాలుగో రోజుకు చేరుకున్న బస్సు యాత్ర.. నేడు ఆ నియోజకవర్గంలో జగన్ పర్యటన

by Indraja |   ( Updated:2024-03-30 07:04:47.0  )
నాలుగో రోజుకు చేరుకున్న బస్సు యాత్ర.. నేడు ఆ నియోజకవర్గంలో జగన్ పర్యటన
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. కాగా జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. కాగా నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నియోజకవర్గంలో జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు జగన్ పత్తికొండలో పర్యటించనున్నారు. ప్రస్తుతం పత్తికొండ శివారు లోని KGN ఫంక్షన్ హాల్ దగ్గర జగన్ ఉన్నారు.

ఇక రోజు ఉదయం 10 గంటలకు పత్తికొండలో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాగా మూడు రోజుల పాటు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పర్యటించిన జగన్.. నేడు రాతన, తుగ్గలి, జొన్నగిరి మీదుగా నేడు ఈ యాత్ర అనంతపురంలోకి ప్రవేశించనుంది.ఇక ఈ యాత్ర ద్వారా క్యాడర్ చైతన్య పరుస్తూనే ప్రజలను కూడా వైసీపీ వైపు మలుపుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

Read More..

ప్రధాన పార్టీల అధినేతలకు నిద్ర కరువు.. వెంటాడుతున్న కొత్త టెన్షన్లు ఇవే!

Advertisement

Next Story