ఎన్నికల వేళ ఉద్యోగులకు.. షాక్ ఇచ్చిన జగన్ సర్కార్?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-02 14:13:32.0  )
AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని ఆ బిల్లును అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని GAD అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది. ఈ క్రమంలో పరిమితులకు మించి పవర్ ఉపయోగించుకున్న ఉద్యోగులు బిల్లు చెల్లించాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే వారి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని వెల్లడించారు.


Read More..

Ap Elections: ఎన్నికల మేనిఫెస్టోపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed