అయ్యప్ప స్వాముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ : టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్

by Shiva |
అయ్యప్ప స్వాముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ : టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్ : మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాముల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. శబరిమలకు వె్లే భక్తులకు కనీసం బస్సు సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ దౌర్భగ్యమని మండిపడ్డారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. హిందూ ఆలయాలను దేవాదాయ శాఖ మంత్రి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. దీక్ష విరమణకు అయ్యప్పలు వెళ్తుంటే.. కనీసం వారిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వైసీపీ సభలకు ప్రత్యేక బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించడంపై ఉన్న శ్రద్ధ.. అయ్యప్ప స్వాములకు ప్రత్యేక బస్సులు కేటాయించడంపై లేదని విమర్శించారు. శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది గాయాలపాలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే శబరిమల వెళ్లే భక్తుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story