- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YS వివేకా హత్యపై జగన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా హత్యపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో నామినేషన్ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకానందకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం అని బాంబు పేల్చారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసు అన్నారు. వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారని తెలిపారు. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి అని జగన్ ఫైర్ అయ్యారు.
చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుంది అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని ప్రశ్నించారు. వైఎస్ అవినాష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై జగన్ స్పందిస్తూ.. వైఎస్ అవినాష్ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్లు.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద వాళ్లంతా కుట్రలో భాగమవుతున్నారని ఫైర్ అయ్యారు. మన బ్రాండ్ వైఎస్ఆర్, మన బ్రాండ్ కడపను, మన బ్రాండ్ పులివెందులను.. కొట్టాలనుకుంటున్న వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధమేనా? అని అంటూ జగన్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇవి నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే.. దుర్మార్గం మరొకటి ఉందా అని జగన్ ప్రశ్నించారు.