- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్‌లను కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వాలని ప్రభుత్వం నిర్నయించింది. అలాగే 2017 పీఆర్సీ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్ జగన్ చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం జరిగిందని...తాజాగా జీతాలతోపాటే అలవెన్స్‌లు ఇచ్చేందుకు అంగీకరించడం హర్షించదగ్గ పరిణామం అని ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు.