- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్?
దిశ, వెబ్ డెస్క్:ఏపీలో ఈ సారి ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోందని చెప్పవచ్చు.పొత్తు పార్టీలు, వైసీపీ మధ్య ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అయితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారం నిలబెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.అయితే ఈ షెడ్యూల్ కి రిలీజ్ కు ముందు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అవి ఏంటంటే.. ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పెండింగ్ DA లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలవడటానికి కొన్ని గంటల ముందు జీవో జారీ చేసింది.అమరావతిలోని పిచ్చుకల పాలెం గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లు జీవో లో పేర్కొన్నారు. 2019 జీవో లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే స్థలాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.