- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: ఆ జిల్లా పర్యటనకు సిద్దమైన జగన్.. డేట్ ఫిక్స్.
అమలాపురం /రావులపాలెం ఏప్రిల్ 13:వైసీపీ అధినతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావులపాలెంలో పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాల వై.యస్.ఆర్.సి.పి.రీజినల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 03:00 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు ముఖ్యంమత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని తెలియచేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ రాజమండ్రి చేరుకోనున్నారని తెలిపారు.
ఇక 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తరువాత రోజు అనగా 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకోనున్నారని పేర్కొన్నారు. ఇక 18వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారని తెలిపారు.
కాగా ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసినదిగా వైసీపీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, పొన్నాడ వెంకట సతీష్, చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, విప్పర్తి వేణుగోపాల్, రాపాక వరప్రసాద్, చింతా అనురాధ తదితరులు పాల్గొన్నారు.