- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు పథకాలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన మంగళగిరిలో పరిధిలోని చినకాకానిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికలు రాగానే జగన్‌లా అబద్ధాలు చెప్పి ఆ తరువాత చేతులు దులుపుకునే రకమని, తమ పార్టీ ఆ టైపు కాదని అన్నారు. తమ కూటమి అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో రూ. కోట్లల్లో అవినీతి జరిగిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు భూములను చెరబట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎంకు లోకేశ్ చాలెంజ్ చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అదే జగన్ ఏసీ బస్సుల్లో తిరుగుతున్నారంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.