TDP వాళ్లు ఎవరినైనా కొట్టొచ్చు.. చంపొచ్చా..? ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్

by Satheesh |
TDP వాళ్లు ఎవరినైనా కొట్టొచ్చు.. చంపొచ్చా..? ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. టీడీపీ వాళ్లు రాష్ట్రంలో ఎవరినైనా కొట్టొచ్చు.. చంపొచ్చా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవీక పాలన సాగుతోందని.. ఏపీలో లా అండ్ అర్డర్ లేదని ఆరోపించారు. కాగా, పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుడు రషీద్ కుటుంబాన్ని శుక్రవారం జగన్ పరామర్శించారు. రషీద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లు ఏ అరాచకం చేసిన పట్టించుకోరా అని పోలీసులను నిలదీశారు.

దాడులు చేసిన వారిపై కాకుండా తిరిగి బాధితులపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 36 హత్యలు జరిగాయని, 45 రోజుల్లోనే 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని నిప్పులు చెరిగారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. రూ.490 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఇవికాక బోనస్‌గా వెయ్యికి పైగా దాడులు, దౌర్జన్యాలు చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్నవి ఇవేనని ఫైర్ అయ్యారు. రషీద్ హత్య వెనక పోలీసుల వైఫల్యం ఉందని.. రాజకీయ హత్య చేసి పనికిమాలిన కారణాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed