BREAKING: చంద్రబాబు అసలు మనిషా.. శాడిస్టా..? బస్ యాత్రలో బరెస్టైన సీఎం జగన్

by Anjali |
BREAKING: చంద్రబాబు అసలు మనిషా.. శాడిస్టా..? బస్ యాత్రలో బరెస్టైన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అసలు మనిషా.. శాడిస్టా..? అంటూ సీఎం జగన్ టీడీపీ చీఫ్‌పై ఫైర్ అయ్యారు. ‘‘ఈ ఎన్నికలు జగన్-చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. కుట్రలు, కుతాంత్రలు చేసే వారంతా ఒక్కటవుతున్నాయి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఓ వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒకవైపు, అబద్దం మరోవైపు ఉన్నాయి అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చిత్తూరులో కొనసాగుతోన్న ‘జగన్ బస్సు బహిరంగ సభ’లో సీఎం ప్రసంగించారు. ఈ సభకు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఒక్కడిపై పోరాడటానికి ఇంతమంది వస్తున్నారు. ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం అయినా గుర్తుకు వస్తుందా? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? విలేజ్, క్లీనిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు? పేదలు, పిల్లలు, రైతులు, అవ్వతాతలు, మైనారిటీలు అందరి తరఫున నిలబడేందుకు అంతా సిద్ధమేనా? జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఎవరి హయాంలో మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

ఈ ఓటు వల్ల మన తలరాతలు మారతాయని గుర్తుపెట్టుకోండి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలిపించి డబుల్ సెంచరీ సర్కార్ ఏర్పాటు చేసేందుకు మీరు సిద్ధమా. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మన ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటినీ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు’’. అంటూ సీఎం జగన్ బరెస్ట్ అయ్యారు. అసలు జగన్ మనిషా శాడిస్టా? చంద్రబాబును చంద్రముఖిలా పెట్టెలో పెట్టి బంధించాలి. నిమ్మగడ్డ రమేష్ తో లేఖలు రాయించి కుట్రలు చేశాడు. మళ్లీ జగన్ వస్తేనే వలంటీర్లు మీ ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారు’’. అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Read More..

Ap Politics:సీఎం జగన్మోహన్ రెడ్డిదే అంతిమ విజయం: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Advertisement

Next Story

Most Viewed