ఆ పార్టీకి మద్దతుగా..ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ నటుడు?

by Jakkula Mamatha |   ( Updated:2024-04-18 14:33:00.0  )
ఆ పార్టీకి మద్దతుగా..ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ నటుడు?
X

దిశ ప్రతినిధి,అనకాపల్లి: నియోజకవర్గం పరిధిలోని కశింకోటలో గురువారం ఉదయం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జనసేన, బీజేపీలకు ప్రచారం నిర్వహించారు. కశింకోట మండలం జనసేన కార్యాలయంలో హైపర్ ఆదికి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెయిన్ రోడ్డు మీద ఆంజనేయ స్వామిని దర్శించుకుని కశింకోట మెయిన్ రోడ్‌లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్లి వ్యాపారస్తులకు కొనుగోలుదారులకు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని అందజేసి ఈ ఎలక్షన్‌లో జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి రామకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

నియోజకవర్గంలో గురువారం వారపు సంత జరుగుతుండడంతో యువకులు అధిక సంఖ్యలో యువత జనసేన నాయకుడు హైపర్ ఆదితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కశింకోట మెయిన్ రోడ్డు గుండా సంత బయలు జంక్షన్ నుంచి కాపు వీధి , గొల్లపూడి , కస్పా వీధి , పూసర్ల వీధి , కుమ్మర వీధులలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కశింకోట టీడీపీ,జనసేన మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More...

AP Politics:ప‌వ‌న్‌ కల్యాణ్‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి: కొణిదెల నాగ‌బాబు

Advertisement

Next Story