వైఎస్ షర్మిల పై కేసు నమోదు..కారణం ఇదే?

by Jakkula Mamatha |
వైఎస్ షర్మిల పై కేసు నమోదు..కారణం ఇదే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ నెల (మే 1)ఒకటో తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్‌ షర్మిల సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఘటనను ప్రస్తావించినట్టు సమాచారం. ప్రచారంలో వైఎస్ హత్య గురించి ప్రస్తావించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైఎస్ షర్మిల కోర్టు ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కుతూ వివేకా మ‌ర‌ణ‌మే ప్ర‌ధానాస్త్రంగా ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సభలో ఆమె ఆ వ్యాఖ్యలు చేయడంతో కోడ్‌ ఉల్లంఘన కింద బద్వేల్ ఎన్నికల నోడల్ అధికారి ఎస్వీ కృష్ణ భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బద్వేలు పోలీసులు షర్మిల పై కేసు నమోదు చేశారు. ఈ నేప‌థ్యంలో కోర్టు ష‌ర్మిల‌పై చ‌ర్య‌లు తీసుకుంటుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

Next Story