మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టమని మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా?

by Seetharam |   ( Updated:2023-07-17 09:43:59.0  )
మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టమని మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న టీడీపీ మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టులు పెడుతున్నారు అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడంపై ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైసీపీ ఆవిర్బావం తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టమని మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా? ఒక వ్యక్తి గురించి తప్పుగా ప్రచారం చేస్తే వాళ్లు ఎంత బాధపడతాయో జగన్ రెడ్డికి ఏం తెలుసు? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను మార్ఫింగ్ చిత్రాలతో అత్యంత అసభ్యకరంగా చిత్రీకరిస్తూ పోస్టులు పెడుతున్నా వారి జోలికి పోలీసులు వెళ్లకపోవడం దేనికి సంకేతం? అని నిలదీశారు. సీఎం జగన్ భార్య భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆగమేఘాలపై అరెస్టులు చేస్తున్న పోలీసులు...ఇతర మహిళలను అత్యంత నీచింగా దూషిస్తూ పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏం సమాధానం చెప్తారు? అని నిలదీశారు. మహిళలకు ప్రభుత్వమే రక్షణ కల్పించకపోతే ఇంకెవరి దగ్గరకు వెళ్లాలి? ఇకనైనా ఇలాంటి దిగజారుడు చర్యలు మానుకోండి. లేకపోతే మహిళా లోకం మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Advertisement

Next Story