- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి సొమ్ము ఊదేస్తున్నారు ?
వేసవిలో పనుల్లేని సమయంలో కూలీలకు పట్టెడన్నం పెట్టే ఉపాధి హామీ పథకం కొందరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. కర్షకుల చెమట చుక్కల్లో తడిచిన కాసులకు పడిన కొందరు అధికారుల ధన దాహానికి ఉపాధి రూపు మారిపోతోంది. రైతన్న కష్టాన్ని వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్న కొందరు సిబ్బంది అక్రమార్జనకు అంతే లేకుండాపోతోంది. దీంతో ఉపాధి పథకం లక్ష్యం నీరుగారి.. అక్రమార్కుల గుప్పిట్లో చేరిపోతోంది.
దిశ, దేవనకొండ: పేదలకు ఉపాధి పనులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఉపాధి వనరుగా మారింది. ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లు అధికారులు కలిసి ఉపాధి పేరుతో లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారు. దేవనకొండ మండలంలోని 26 పంచాయతీలు ఉండగా రెండు,మూడు గ్రామాలు మినహా అన్ని చోట్లా ఉపాధి నిధులు బొక్కేస్తున్నారు. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగుల్లో చేసిన పనులను టెక్నికల్ అసిస్టెంట్‌లు కొలతలు తీసి.. ఉన్న పనులకు అధికంగా మూడు రెట్లు పనులు చేసినట్లు చూపిస్తున్నారు. మరో వైపు పనులు చేసినప్పటికీ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర పనులు..అక్రమ వసూళ్లు
ప్రధానంగా దేవనకొండ మండల పరిధిలోని గ్రామాల్లో ఈ అవినీతి వ్యవహారం తారస్థాయికి చేరింది. గ్రామంలో అరకొరగా పనులు చేసి కొలతలు తీస్తున్నారు. చేసిన పనులకంటే ఎక్కువగా చూపిస్తూ సీనియర్ మేట్, టెక్నికల్ అసిస్టెంట్‌లు కలిసి బిల్లులు తయారు చేస్తున్నారు. ఈ బిల్లులను మండల అధికారుల వద్ద అప్రూవల్ చేయించుకుని ప్రజల సొమ్మును దండుకుంటున్నారు. ఇదే గ్రామంలో వ్యాపారులకు, గ్రామంలో నివాసం ఉండని వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి మస్టర్లు వేస్తున్నారు. మండలంలో చనిపోయిన వారి పేర్లతోనూ, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారి పేరుతోనూ సింగిల్ జాబ్ కార్డులు సృష్టిస్తున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించిన ఉపాధి పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.