AP:విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ షర్మిల

by Jakkula Mamatha |   ( Updated:2024-06-21 14:40:46.0  )
AP:విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ షర్మిల
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల నిర్వహించిన నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ స్కామ్ జరిగిందనే ఆధారాలతో సహా బయటపడిందని ఆరోపించారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్ మార్కులు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించింది. అదనపు సమయం ఇవ్వొచ్చు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు విజయవాడలోని లెనిన్ కూడలిలో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు.

Advertisement

Next Story