రసవత్తరంగా రాయచోటి రాజకీయం.. టీడీపీకి ప్రాణ సంకటం

by Shiva |
రసవత్తరంగా రాయచోటి రాజకీయం.. టీడీపీకి ప్రాణ సంకటం
X

దిశ, కడప ప్రతినిధి: ఉమ్మడి కడప జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికీ టీడీపీకి కఠినతరంగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటే తదితర పరిణామాలను ఎన్నికల లోపు పరిష్కరించుకొనేందుకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా టికెట్ దక్కని వారి వైఖరిపై ఓ స్పష్టతకు వచ్చేందుకు అవకాశం ఉండేది. అయితే, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాపై వ్యవహరిస్తున్న నాన్చుడు ధోరణి రాబయే ఎన్నికల్లో పార్టీకి సమస్యగా మారుతుందని ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ టికెట్ వ్యవహారం ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఒకే సీటుకు ముగ్గురు పోటీ..

రాయచోటిలో ఇద్దరు నాయకులు నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మరో టీడీపీ నాయకుడు రాంప్రసాద్‌రెడ్డి ఆ పార్టీ నుంచి టికెట్ రేసులో ఉంటే మూడు రోజులు క్రితం వైసీపీ నుంచి పార్టీలో చేరిన ద్వారకనాథరెడ్డితో కలిపి ముగ్గురు ఆశావహులు అయ్యారు. ద్వారకనాథ రెడ్డి ముందు నుంచే దేశం టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. పార్టీ టికెట్ టార్గెట్‌గా ఆయన టీడీపీలో చేరారు. టికెట్ గట్టిగా అడగాలంటే ముందు పార్టీలో చేరాలన్న నిర్ణయంతో ఆయన టీడీపీలో చేరానని చెప్పుకొస్తున్నారు. అయితే ఉన్న ముగ్గురిలో రాయచోటి టికెట్ ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి సర్ది చెబుతారు.. అనేది సమస్యగా మారింది.

పార్టీకి సంకటమే..

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ముగ్గురు నేతలు ఆశిస్తుండడం ఆ పార్టీకి సంకటంగా మారింది. వారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాగా, మరొకరు పార్టీలో ముఖ్యమైన నేతగా కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న ఆర్‌.రమేష్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్లొంటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి‌రెడ్డికి కడప టీడీపీ ఇంచార్జీగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కూడా అమెకే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే ప్రాతిపదిక పార్టీ అవలంభిస్తే ఉమ్మడి కడప జిల్లా నుంచి కడప అసెంబ్లీకి మారసవత్తరంగా రాయచోటి రాజకీయం.. టీడీపీకి ప్రాణ సంకటంధవరెడ్డికి టికెట్ ఖరారు అయితే రాయచోటిలో రమేష్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.

తారకరత్న కుటుంబంతో బంధుత్వంతో..

ద్వారకానాథ రెడ్డి టీడీపీలో చేరడంతో రాయచోటీ రాజకీయం వేడెక్కింది. రాయచోటి టిక్కెట్ కోసం పార్టీలో చేరక ముందు నుంచే ఆయన రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకు నందమూరి తారకరత్న కుటుంబంతో ఉన్న బంధుత్వం టికెట్ కేటాయింపు కోసం ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ద్వారకనాథ‌రెడ్డి అక్క అల్లుడు నందమూరి తారకరత్న కావడంతో ఆ కుటుంబంతో వారికి బంధుత్వం ఉంది. 1994 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన వచ్చే ఈ ఏడాది జోరుగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలన్న యోచనతో ఉన్న ఆయన వైసీపీని వీడి టీడీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం సాగిస్తున్నారు.

మండిపల్లి రాంప్రసాద్ ధీమా..

ఇక మరో టీడీపీ సినీయర్ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు అచ్చెన్నాయుడుతో పాటు లోకేష్‌లను పలు మార్లు కలిసినట్లు సమాచారం. అంతే కాదు పీలేరుకు చెందిన నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి సహాకారం కూడా ఇతడికి ఉంటుందని భావిస్తున్నారు. రాయచోటి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో రాంప్రసాద్ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది.

రకరకాల అంచనాలతో ముగ్గురు నేతలు రాయచోటి టికెట్ రేసులో ఉండడంతో వారిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఒక్కరికి టికెట్ ఖరారు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా అసంతృప్తులు అలజడి రేపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయచోటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీకి పులివెందుల తరువాత అంతటి పట్టును కలిగి ఉంది. ఇక్కడ టికెట్ల కేటాయింపులో, నేతల సర్దుబాటులో ఏమాత్రం తప్పటడుగు పడినా.. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సంకట పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed