అనకాపల్లి శంఖారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-19 13:33:05.0  )
అనకాపల్లి శంఖారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి శంఖారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి అమర్‌నాథ్‌కు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు నిండు సభలో కోడిగుడ్డును ఆయన ప్రదర్శించారు. అమర్‌నాథ్‌కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానని, దీనిని ఆయనకు చేర్చాలని స్థానిక ప్రజలకు కోరారు. చిన్నవయసులో మంత్రి పదవి చేపట్టిన కోడి గుడ్డు మంత్రి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. కానీ, ఆయన 600 ఎకరాల ప్రభుత్వ భూమి, గ్రావెల్, మెటల్ కొట్టేసి నియోజకవర్గాన్ని గాలికొదిలేశాడని లోకేష్ ధ్వజమెత్తారు. దీంతో పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలతో సభ దద్దరిల్లిపోయింది.

Advertisement

Next Story