రిజల్ట్ ఎఫెక్ట్.. తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య

by sudharani |
రిజల్ట్ ఎఫెక్ట్.. తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు రిలీజైన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలు ప్రకటించింది ఇంటర్ బోర్డు. అయితే ఈ ఫలితాల్లో పాస్ కాలేదని, మార్కులు తక్కువ వచ్చాయనే కారణాలతో రాష్ట్రంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాకు చెందిన అనూష (17), బాబు (17), అనకాపల్లిలో తులసి కిరణ్ (17), శ్రీకాకుళం జిల్లాలో తరుణ్ (17), విశాఖ జిల్లాలో అఖిలశ్రీ (16), బోనెల జగదీష్ (18), అనంతరపురం జిల్లాలో మహేష్ (17), ఎన్టీఆర్ జిల్లాలో షేక్ జాన్ సైదా (16), చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed