- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Girl Missing: 15 రోజులుగా కనిపించని కూతురు.. పవన్ కల్యాణే దిక్కంటున్న తల్లిదండ్రులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల కాలంలో బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కామాంధులు తమ క్షణిక ఆనందం కోసం మహిళలను చిదిమేస్తున్నారు. ఈడొచ్చిన ఆడపిల్లల్నే కాదు.. చిన్నపిల్లల్ని కూడా వదలడం లేదు. అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న ఆడపిల్లలకు ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కాకినాడ జిల్లా (Kakinada) గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతి ప్రత్తిపాడు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అక్టోబర్ 22న కాలేజీకి వెళ్లిన తమ కూతురు తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురు ఎక్కడికెళ్లిందని ప్రిన్సిపల్ ను అడిగితే.. ఎవరో వచ్చి తీసుకెళ్లారని చెప్పారని, అతను అన్నయ్యగా చెప్పాడని చెప్పాడన్నారు. తమ అనుమతి లేకుండా కూతురిని కాలేజీ నుంచి బయటికి పంపారని వాపోయారు. సాయంత్రం 6 గంటల వరకూ తమ కూతురు వెళ్లిపోయిందని తెలియలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వెతుకుతున్నామనే చెబుతున్నారు తప్ప.. పురోగతి లేదన్నారు.
తమ కూతురు ఎక్కడున్నా.. తిరిగి వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అభ్యరించారు. దయచేసి తమ కూతురిని తిరిగి తీసుకొచ్చేలా చూడాలని, లేదంటే కుటుంబమంతటికీ ఆత్మహత్యే శరణ్యమన్నారు.