AP:‘ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP:‘ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్‌గా పార్టీ అధిష్టానం నియమించిన తర్వాత ఆయన విశాఖలో మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలతొ గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణను చంద్రబాబు నాయుడు పూర్తిగా విస్మ రించారన్నారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వేల కోట్లకు విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తాము మొదటి నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఉత్తరాంధ్రకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అందులో భాగంగానే ఆర్.బి.ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ నుంచి అమరావతి తరలించే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని, భవిష్యత్తు లో ఉత్తరాంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 44 పెరుగుతాయన్నారు. మహిళా కోటాతో పాటు రిజర్వేషన్లు పలుచోట్ల మారతాయని వివరించారు. ఈ పరిణామాలు అన్నిటిని చర్చించుకుని రాబోవు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట నిజమేనని వెల్లడించారు. ఇప్పటి నుంచి కార్యకర్తల అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ నగర మేయర్ గోల గాని హరి వెంకట కుమారి జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రద శాసనసభ్యులు రేగు మత్య లింగమా శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, రవి బాబు, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, కన్నా బాబు రాజు, కంబాల జోగులు,పెట్ల ఉమా గణేష్, అదిప్ రాజు, చింతలపూడి వెంకటరామయ్య, భాగ్య లక్ష్మి శోభ హైమవతి సమన్వయ కర్తలు కేకే రాజు మలసల కిషోర్, పి వరలక్ష్మి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి,గుడిమెట్ల రవి కుమార్ (రవి రెడ్డి),ఉరుకూటి అప్పారావు రాష్ట్ర మాజీ చైర్మన్‌లు పార్టీ ముఖ్య నాయుకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story