ఆ విషయంలో వైఎస్ జగన్ ప్రపంచానికే ఆదర్శం..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-16 09:56:32.0  )
ఆ విషయంలో వైఎస్ జగన్ ప్రపంచానికే ఆదర్శం..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం నిషేధం అన్నారు అది చేయకుండా కల్తీ మద్యం సరఫరా చేశారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం వైసీపీ ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ గనులు, అడవులను అడ్డగోలుగా దోచేశాడని విమర్శించారు. స్మగ్లింగ్‌లో ప్రపంచానికే జగన్ ఆదర్శంగా నిలిచాడని ధ్వజమెత్తారు. అడ్డగోలు అక్రమ మైనింగ్‌తో వేల కోట్లను దోచుకున్నాడని ఆరోపించారు. రుషికొండ పై సైతం విధ్వంసానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.

Advertisement

Next Story