- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీలో తారస్థాయికి వర్గ విభేదాలు.. గిరిధర్‌రెడ్డికి అందని సహకారం
దిశ, నెల్లూరు: వైసీపీని విభేదించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తమ్ముడు గిరిధర్ రెడ్డి కూడా వైసీపీని వీడి అన్నతో పాటే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధిష్టానం వారిని సస్పెండ్ చేసింది. అనంతరం గిరిధర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు. 300పైగా కార్లతో ర్యాలీగా వెళ్లీ మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేత పార్టీ కండువా కప్పించుకున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరి టీడీపీ ముఖ్యనేతలకు మాత్రం గిరిధర్ రెడ్డి చేరిక మింగుడుపడడం లేదు. గిరిధర్ రెడ్డి కూడా టీడీపీ జిల్లా కార్యాలయంలోనికి ఇప్పటికీ ఒక్క సారి కూడా అడుగు పెట్టలేదు. టీడీపీలో చేరినప్పటికి గిరిధర్ రెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
చేరికను వ్యతిరేకించిన సీనియర్లు
మొదటి నుంచే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడాన్ని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. అయితే అధిష్టానం ఆ నేతలను మాటలను పట్టించుకోకుండా చంద్రబాబు గిరిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గిరిధర్ రెడ్డి చేరిక నచ్చని నేతలు ఆయనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని సమాచారం. గిరిధర్ రెడ్డి కూడా తనదైన శైలిలో తనతో పాటు పార్టీలో చేరిన వర్గాన్ని ప్రోత్సహిస్తూ డివిజన్ వారీగా సీనియర్లతో సంబంధం లేకుండా తన అనుచరులతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. గిరిధర్ రెడ్డి ప్లాన్ ప్రకారమే టీడీపీలో చేరారని సీనియర్ నేతల్లో ఓ అభిప్రాయం ఉంది. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలో చేరుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయితే జిల్లాలోని టీడీపీ నేతలు మాత్రం కోటంరెడ్డి చేరికను వ్యతిరేకించారు. గతంలో టీడీపీ నేతలను శ్రీధర్ రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించారని ఆయనను పార్టీలోకి తీసుకునేది లేదని టీడీపీ నేతలు కూడా తెగేసిచెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి ప్లాన్ మార్చి ముందుగా తమ్ముడు, ఆ తర్వాత తను వచ్చే ప్రయత్నంతోనే తమ్ముడిని పార్టీలోకి పంపించారని అనుకుంటున్నారు.
టీడీపీ నేతల నుంచి అందని ఆహ్వానం
టీడీపీ జిల్లా కార్యాలయంలో సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా గిరిధర్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు. తనను పిలవనందుకే గిరిధర్ రెడ్డి కూడా టీడీపీ నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరుకావడం లేదని చర్చసాగుతుంది. గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నసమయంలో బ్యానర్లలో జిల్లాలోని ప్రముఖనేతలు ఫొటోలు కనిపించక పోవడం టీడీపీ అధినేత చంద్రబాబు లోకేశ్ ఫొటోలు మాత్రమే కనిపించడం గమనిస్తే గిరిధర్ రెడ్డి కూడా ఆ నేతలతో పట్టీపట్టనట్టుగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల నెల్లూరుకు చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం గిరిధర్ రెడ్డి పిలిచిపిలవనట్టుగా సీనియర్లు అహ్వానించారని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు మైండ్‌గేమ్
చంద్రబాబు మైండ్ గేమ్ ప్రకారమే గిరిధర్ రెడ్డి పార్టీలో చేరారని ఇప్పటికిప్పుడు శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదని, స్వతంత్రంగానే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు కోటంరెడ్డికి సూచించారని చెప్పుకుంటున్నారు. మరోవైపు కోటంరెడ్డే స్వయంగా తన రూరల్ సమస్యలపై పోరాటం చేసి, వాటిని సాధించుకున్న తర్వాతే టీడీపీ కండువా కప్పుకుంటానని చంద్రబాబుకి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది నిజమో తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ప్రజలపై కామెంట్స్.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
- Tags
- TDP leaders