- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనం:నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో: 15రోజులుగా తమ న్యాయబద్దమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వేతనాలు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలను కోరుకున్న అంగన్వాడీలపై కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గం అని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీల పై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమేనని అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ...తమ డిమాండ్లపై ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంగన్వాడీలకు లేవా? అని నిలదీశారు. విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్దమైన పోరాటానికి నారా లోకేశ్ తన మద్దతు ప్రకటించారు. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని నారా లోకేశ్ ప్రకటనలో డిమాండ్ చేశారు.