- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మీరు ఇలా మాట్లాడితే ఎలా’.. టీడీపీ ఎమ్మెల్యే పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు(శనివారం) నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో దెందులూరు(Denduluru) టీడీపీ(TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(MLA Chinthamaneni Prabhakar)పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అయితే.. బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(YCP Abbaya Chowdary) కారు అడ్డుగా ఉండటంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు వివరించేందుకు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి(TDP Office) ఎమ్మెల్యే చింతమనేని వచ్చారు. కానీ అప్పటికే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో(Social Media) వైరల్ గా మారడంతో సీఎం చంద్రబాబు చింతమనేని(Chintamaneni Prabhakar))పై అసహనం వ్యక్తం చేశారు.
మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని చెప్పారు. ‘‘సహనంతో వ్యవహరించాలి.. ఇలా మాట్లాడితే ఎలా’’ అంటూ ఫైరయ్యారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని.. కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్ తన తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.