- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:‘ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే..ఆ కండీషన్లు పెట్టకూడదు’..సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం చిన్న చిన్న సెట్లు నిర్మించాలని సీనియర్ నటుడు సుమన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిన్న(శుక్రవారం) సచివాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లను ఆయన కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రులను కలవడం ఇదే మొదటి సారి అని తెలిపారు. ఈ క్రమంలో వారికి సుమన్ అభినందనలు తెలియజేశారు. సినిమా వారికి సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే సెట్లు నిర్మించి.. అవి రన్నింగ్ అవ్వడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబంధంగా పెడితే ఆదాయానికి కొదవ ఉండదని సినీ నటుడు సుమన్ అన్నారు.
ఏపీలో చిన్న సినిమాల చిత్రీకరణకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన మంత్రులను కోరారు. లొకేషన్ల విషయంలో నియంత్రణ లేకుండా చూడాలి. హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ వ్యయం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. అందుకే నిర్మాతలు ఏపీ వైపు చూస్తున్నారు అని సుమన్ చెప్పారు. ఈ నేపథ్యంలో అందరూ చర్చించి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడాలని కోరారు. నిర్మాతలు కూడా ఇంట్రస్ట్‌గా ఉన్నారు కాబట్టి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పుకొచ్చారు.