- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయలసీమ పౌరుషం ఉంటే నా చాలెంజ్ స్వీకరించు.. మాజీ మంత్రి అనిల్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు గడ్డ మీద ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్ధి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలెంజ్ విసిరారు. తాను అన్ని వదిలేసి రాజకీయాలే పరమావధిగా బ్రతుకుతున్నానని, తన 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసురుతున్నా అన్నారు. నేను పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ సవాల్ నీ కొడుకు చేత స్వీకరించే దమ్ముందా? అని చాలెంజ్ విసిరారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా ఉన్నానని, నారా లోకేశ్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదని, నేను పల్నాడు గడ్డ మీద నుంచి చాలెంజ్ విసురుతున్నానని, నీకు చిత్తూరు పౌరుషం గాని, రాయలసీమ పౌరుషం గాని ఉంటే నా చాలెంజ్ నువ్వు గానీ నీ కొడుకు చేత స్వీకరింపజేయాలని అనిల్ కుమార్ సవాల్ విసిరాడు.