Ayyanna Patrudu: జగన్ చెయ్యి ఎత్తి అడిగితే మైక్ ఇస్తా.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు

by Ramesh Goud |
Ayyanna Patrudu: జగన్ చెయ్యి ఎత్తి అడిగితే మైక్ ఇస్తా.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: శాసనసభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నామని, జగన్ అడిగితే కూడా మైక్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ఆయన శుక్రవారం దర్శనం పూర్తి చేసుకొని అన్నదానం సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఇవ్వాళ తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలను సందర్శించి, జూపార్క్ లో ఓ మెక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో అన్ని అంశాలపై చర్చ జరిగితేనే ప్రజలకు పాలనపై అవగాహన వస్తుందని, సభకు రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని అన్నారు.

సభకు వస్తే పార్టీలతో సంబందం లేకుండా అందరికీ అవకాశం ఇస్తామని, సభలో మాట్లాడటం ఎమ్మెల్యేలుగా వాళ్ల హక్కు అని చెప్పారు. జగన్ కూడా సభకు రావాలని, ఆయన వచ్చి చేయి ఎత్తి అడిగితే స్పీకర్ గా మాట్లాడే అవకాశం ఇస్తానని అన్నారు. సభా కట్టుబాట్లు, పద్దతులలకు లోబడి మాట్లాడితే మార్యాద అని, అంతే కానీ సభా కార్యక్రమాలను ఉల్లంఘిస్తే ఊరుకోనని అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదాపై చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభలో 80 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని, వారందరికీ త్వరలోనే శిక్షణ ఇస్తామని అన్నారు. ఇక రాష్ట్రం గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో నష్టపోయిందని, దానికి రానున్న ఐదేళ్లలో పునర్వైభవం రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్యన్న పాత్రుడు వెల్లడించాడు.

Advertisement

Next Story