- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారం లేకపోతే పిరికిపందే: వైఎస్ జగన్‌పై తులసిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు అని ఏపీ కాంగ్రెస్ మీడియా విభాగ ఇన్‌చార్జి తులసిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పాడని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిని కోర్టులు తేలుస్తాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అణువణువునా పగ పగ అంటూ రగలిపోతున్నారని మండిపడ్డారు. జగన్ సహజ ప్రవృత్తికి అధికారం తోడు అయ్యిందని విమర్శించారు. ఫ్యాక్షనిస్టులకు అధికారం ఉంటే అన్నీ చలాయిస్తారని..అధికారం లేకుంటే వారంతా పిరికిపందలేనని అభివర్ణించారు. వైఎస్ జగన్‌ది తనదీ పులివెందులేనని..వాళ్లను ఎప్పటి నుంచో చూస్తున్నానని ఏపీ కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.