- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి ఓకే అంటే సీఎంను చేస్తాం: కాంగ్రెస్ సీనియర్ నేత
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవీ ఒప్పుకుంటే తిరుపతి నుంచి గెలిపించి ఆయనను రాష్ట్ర సీఎంగా చేస్తామని.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చింతా మోహన్ మాట్లాడుతూ.. చిరంజీవి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నార్నారు. అలాగే ఆయనకు నేటికి కూడా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాథమిక సభ్యత్వం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని.. చిరంజీవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే.. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిపిస్తామని తెలిపారు.
ఈ విషయంపై తాను అధిష్టానం తో మాట్లాడతానని కూడా అన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్ నిర్ణయాల వల్ల ఎస్టీ, మైనార్టీలు వైసీపీకి దూరం అయ్యారని.. వారంత కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించే స్థాయి జగన్‌కు లేదని విమర్శించారు. రానున్న ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు.