- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళగిరిలో లోకేశ్ ఎలా గెలుస్తాడో నేను చూస్తా.. టీడీపీ నేత రాయపాటి రంగారావు ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల వేళ టీడీపీ నేత చంద్రబాబుకు షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత రాయపాటి రంగారావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేశారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి ఇన్నాళ్లు అండగా నిలుస్తూ వచ్చాయి. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావుకు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాయపాటి రంగారావు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తమ కుటుంబాన్ని నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మాకు సరైనా గుర్తింపు లేదని అందుకే పార్టీ నుండి బయటకు వచ్చానని పేర్కొన్నాడు. టీడీపీలో డబ్బున్నోళ్లకే స్థానం ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో తాను కూడా చూస్తానని సవాల్ విసిరారు. అతడిని ఓడించడమే తన మొదటి లక్ష్యమని ప్రతిజ్ఞ చేశారు. వైసీపీ ఆహ్వానిస్తే తప్పకుండా ఆ పార్టీలో చేరతానని, ఎక్కడ నుంచి పోటీ చెయ్యమంటే అక్కడ పోటీ చేస్తానని తెలిపారు.